' మహానటి 'కి మరో అరుదైన గౌరవం

10:45 - November 1, 2018

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం ' మహానటి  ' . సావిత్రి జీవిత కథ ఆధారంగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. అచ్చం సావిత్రినే తలపించిన కీర్తి సురేష్ అభినయం విమర్శకుల నుండి సైతం ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. 49వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్స‌వాలు త్వ‌ర‌లో గోవాలో జ‌ర‌గ‌నున్నాయి. హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం, తుళు... ఇలా భార‌తీయ భాష‌ల నుంచి 24 చిత్రాలు నాన్ ఫీచ‌ర్ ఫిల్మ్స్‌ ఈ చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్‌లో మాత్రం భార‌త‌దేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపిక చేశారు. అందులో ద‌క్షిణాది నుంచి ఒక్క  ' మహానటి  ' కే స్థానం దక్కటం విశేషం.