మహాకూటమి మైనస్‌లు ఏంటి?

16:44 - December 11, 2018

2014 ఎన్నికల్లో కంటే...ఈ సారి కాంగ్రెస్‌ ప్రతిష్ట తెలంగాణలో మరింత మసకబారింది. కనీసం ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా కష్టం మీద దక్కించుకునే స్థితికి గ్రాఫ్‌ పడిపోయింది. కాంగ్రెస్‌ శాసన పక్షనేత జానారెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ పైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌ కూడా గెలుపొందలేకపోయారు. సీనియార్‌ నేతలు డి.కె.అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, జీవన్‌రెడ్డిలు పరాజయం పాలయ్యారు. అధికార పార్టీ గెలవకపోతే...ఇక తామే ఆప్షన్‌ అనే విధానం ఆ పార్టీ కొనసాగించడంతోనే ప్రజలు దూరంగా పెట్టారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలిచే ప్రజాసంఘాలు, ఉద్యమనేతలు కీలకం కానున్నారు. బీఎల్‌ఎఫ్‌గా బరిలోకి దిగిన ప్రత్యామ్నాయ కూటమి బహుజన రాజ్యాధికార నినాదాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే మా టార్గెట్‌. అది ఈ ఎన్నికల్లో రీచ్‌ అయ్యా. భవిష్యత్తులో బహుజన రాజ్యాధికార నినాదాన్ని మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యమని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు పేర్కొంటున్నారు.