మహాకూటమి అందుకే ఆ ఏడు నియోజకవర్గాలను టచ్‌ చేయడంలేదట!

13:47 - November 9, 2018

మహాకూటమి పాత బస్తీలోని ఏడు నియోజకవర్గాలను టచ్‌ చేయడంలేదంట!. అసలు విషియానికి వెలితే...ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుంటే..మరోవైపు నాయకుల్లో అసంతృప్తి కూడా పెరిగిపోతోంది. టికెట్ల విషయంలో ఎంతగానో ఆశిస్తున్న కూటమి నేతలు..కొన్ని నియోజకవర్గాల విషయంలో అసలే మాత్రం స్పందించడం లేదట.ఏడు నియోజకవర్గాల విషయంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అవే పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలు!.  పాతబస్తీలో ఎంఐఎం బలంగా ఉన్న - అక్కడి ఓటర్లు వేరే పార్టీకి ఓటు వేసేందుకు పెద్దగా  ఆసక్తిచూపని నేపథ్యంలో కూటమి నేతలు ఈ రకంగా వ్యవహిస్తున్నారని సమాచారం. గురువారం రాహుల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 10న ఉదయం తొలి జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. మిగిలిన 20 మంది జాబితా రెండో జాబితాలో విడుదలవుంది. దీనికోసం ఈ నెల 11 - 12 న మరో విడుత కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన 26 సీట్లలో టీడీపీకి 14 - టీజేఎస్ కి 8 - సీపీఐకి 3 సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల్లో భాగంగా వచ్చే సీట్లలో పలు నియోజకవర్గాల కోసం పోటీ పడుతున్న నాయకులు...పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల విషయంలో ఏమాత్రం స్పందించడంలేదంటున్నారు.