మహర్షి కోసం మరో బ్యూటీ

13:16 - November 19, 2018

మహేష్ బాబు ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ 25 వ చిత్రం 'మహర్షి' లో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో ఒకే హీరోయిన్ బ్యూటిఫుల్ పూజా హెగ్డే అని అందరూ అనుకున్నారు గానీ వంశీ మాత్రం మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్ మూడు విభిన్న దశలలో విభిన్న కోణాలలో కనిపిస్తాడు. స్టూడెంట్ గా.. ఒక కార్పోరేట్ సంస్థ కు అధిపతిగా.. రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించే వ్యక్తిగా మహేష్ కనిపిస్తాడని అంటున్నారు.  ఇందులో అమెరికాలో కార్పోరేట్ కంపెనీ హెడ్ గా ఉన్న సమయంలో హీరోకు ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుందట. ఆ పాత్ర కోసమే సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేశారట.  మహేష్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే జాక్ పాట కొట్టినట్టే కదా? గతంలో సోనాల్ 'లెజెండ్'.. 'పండగ చేస్కో'.. 'డిక్టేటర్' లాంటి సినిమాలో నటించింది.