' మహర్షి 'కి మెయిన్‌ విలన్‌ దొరికారట!

13:25 - November 24, 2018

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో, విలన్ ఎవరై వుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా సాయికుమార్ కనిపించనున్నట్టు తాజా సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఎవడు' సినిమాలో మెయిన్ విలన్ గా సాయికుమార్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో వంశీ పైడిపల్లి .. ఈ సినిమాలోను  విలన్ గా సాయికుమార్ నే తీసుకున్నాడట. ఈ సినిమాకి సంభందించి హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.