మళ్ళీ రిలీజవుతున్న ' ముత్తు '

18:00 - September 6, 2018

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అంటే దక్షిణాది ప్రేక్షకుల్లోనే కాదు...ఉత్తరాదిలో కూడా ఆయనకు ప్రేక్షకుల ఫాలోయింగ్‌ చాలా వుంది. సూపర్ స్టార్ రెండు దశాబ్దాల కిందటే జపాన్ లో వసూళ్ల మోత మోగించాడు. ఆయన సినిమా ‘ముత్తు’ అక్కడ ప్రభంజనం సృష్టించింది.  అప్పట్లోనే ‘ముత్తు’ అక్కడ 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ముత్తు’ తర్వాత రజనీకి అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. మీనా సైతం పెద్ద స్టార్ అయింది అక్కడే. అయితే.. జపాన్ జనాలు ‘ముత్తు’ చిత్రాన్ని మళ్లీ అక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1995 అక్టోబరు 23న ఈ చిత్రం దక్షిణాదిన రిలీజ్ కాగా.. మూడేళ్ల తర్వాత జపనీస్ లోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఈ చిత్రం అక్కడ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది నవంబరు 23న మళ్లీ అక్కడ రిలీజ్ చేయనున్నారు.