మరో లేడీ ఓరియంటెడ్‌లో సమంత

16:18 - September 24, 2018

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… గతంలో మాదిరిగా కాకుండా పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈమె ‘యూటర్న్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ‘యూటర్న్’ చిత్రంలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమాకు మంచి రివ్యూలు రావడంతో సమంత ఆనందంగా ఉంది. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే ఒక మంచి సినిమా చేసిన తృప్తి తనకు ఉంది అంటూ సమంత సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇకపై వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలని ఈమె భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. యూటర్న్ తర్వాత సమంత చేయబోతున్న మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మిస్ గ్రానీ’.

సమంత ఈ చిత్రంలో 60 ఏళ్లు దాటిన బామ్మగా 25 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిగా కనిపించనుంది అంటూ ఫిల్మ్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సినిమా ప్రకటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

కొరియన్ మూవీ అయిన ‘మిస్ గ్రానీ’ చిత్రంను నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబు రీమేక్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మిస్ గ్రానీ రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు దక్కించుకున్నారని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంను అతి త్వరలోనే ప్రకటిస్తామని సురేష్ ప్రొడక్షన్స్ సంబంధీకులు అంటున్నారు.