మరో బంపర్‌ ఆఫర్‌తో జియో

11:45 - October 21, 2018

జియో దివాళీ ధమాకా 100శాతం క్యాష్‌బ్యాక్‌ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చారు. దీనికి తోడు సరికొత్త వార్షిక ప్లాన్‌ను కూడా జియో ప్రకటించింది. 365 రోజులపాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్‌ 4జీ డేటాను ఇస్తారు. దీపావళి పండగను పురస్కరించుకుని టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీని విలువ రూ.1,699గా నిర్ణయించారు. అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా జియో యాప్‌లను వాడుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా రూ.149 కానీ ఆపైన కానీ రీ ఛార్జి చేసుకునే కస్టమర్లకు అంతే విలువైన కూపన్లు లభిస్తాయి. పాత కస్టమర్లకు, కొత్త కస్టమర్లకు ఈ ఆఫర్‌లు లభిస్తాయి. రీఛార్జి చేసుకున్న కస్టమర్లకు కూపన్లు మై జియో యాప్‌లో ఉండే మై కూపన్స్‌ విభాగంలో ఉంచుతారు. నవంబరు చివరి వరకు ఈ ఆఫర్‌ అమలులో ఉంటుంది. వచ్చే డిసెంబరు నెలాఖరులోగా ఈ కూపన్లను ఉపయోగించుకోవలసి ఉంటుంది. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో, మై జియో స్టోర్స్‌లో వస్తువులు కొనుగోలు చేసిన సందర్భాలలో ఈ కూపన్లను రిడీమ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. రూ.5వేలు, అంతకు మించి ఎక్కువ విలువ కలిగిన కొనుగోళ్లు చేసినప్పుడు మాత్రమే ఈ కూపన్లు చెల్లుబాటు అవుతాయి. కొత్తగా ఏడాది కాలానికి వచ్చిన ప్లాన్‌లో రూ.1,699కు రీఛార్జి చేసుకున్నవారికి మూడు రూ.500ల కూపన్లు, ఒక రూ.200ల కూపను మొత్తం నాలుగు కూపన్లు అంతే విలువకు సమానంగా లభిస్తాయి.