మరో కొత్త హీరో,హీరోయిన్‌ని పరిచయం చేస్తున్న శేఖర్‌ కమ్ముల

11:41 - November 26, 2018

టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకమైన స్థానం వుంది.కొత్త వాల్లకే  ఆయన ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. శేఖర్‌ కమ్ముల తీసే సినిమాలు, అందులోని క్యారెక్టర్స్‌ సహజత్వానికి దగ్గరగా ఉండటం వల్లనే  ప్రేక్షకుల మనసులను చేరుతుంటాయి. శేఖర్‌ కమ్ముల ఇప్పుడు ఒక కొత్త కధతో సినిమా చేస్తున్నారు. దీనిలో కూడా కొత్త హీరో, హీరోయిన్‌ని ఇండిస్టీకి పరిచయం చేస్తున్నారు. ఇందులో తీసుకున్న హీరోయిన్‌ విజయవాడకు చెందిన అమ్మాయి అన్నది తాజా సమాచారం. ఆ అమ్మాయి మంచి డాన్సర్ అని తెలుస్తోంది. డిసెంబర్ 2వ వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ లోగానే శేఖర్ కమ్ముల పూర్తి వివరాలు ప్రకటించే ఛాన్స్ ఉందట.