మరోసారి నానీ- సమంతల కాంబినేషన్‌

13:12 - September 29, 2018

గతంలో నాని హీరోగా సమంతా హీరోయిన్ గా రూపొందిన  మూవీ ' ఎటో వెళ్లిపోయింది మనసు ' మంచి క్లాసిక్ గా మిగిలిపోయింది. మరోసారి నానీ- సమంతల కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని సమాచారం. సమంతా ఇప్పుడంటే పెళ్లయ్యాక కొత్త కొత్త రోల్స్ లో విభిన్నంగా కనిపిస్తోంది కానీ కెరీర్ ప్రారంభంలో చేసిన చాలా రోల్స్ తనకు యూత్ లో క్యూట్ బ్యూటీగా పెద్ద ఫాలోయింగ్ ని తెచ్చాయి. తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష జంటగా 96 అనే సినిమా రూపొందింది. అక్టోబర్ 4న దీన్ని విడుదల చేయబోతున్నారు. మొరటుగా అనిపించే విజయ్ స్వీట్ బ్యూటీ త్రిష కాంబో మీద ఇప్పటికే తమిళ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ 96నే  నాని సమంతాలతో తెలుగులో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట దిల్ రాజు. కథ చెప్పారా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనే కన్ఫర్మేషన్ లేదు కానీ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. విడుదల కాకముందే దిల్ రాజు హక్కులు కొన్నారు అంటే కంటెంట్ చూసారో లేక ఒక అంచనా మీద దీన్ని కొనేశారో వేచి చూడాలి. ఒకవేళ కార్యరూపం దాలిస్తే నానిని సమంతాను మరోసారి జోడిగా చూడొచ్చు.