మరోసారి దేవరకొండ హవా...

16:09 - October 6, 2018

' గీతా గోవిందం 'తో 70 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ మరోసారి తన హవా చాటుకున్నాడు. దేవరకొండ నటించిన నోటా ఈనెల 5న రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.  ‘నోటా’కు తొలి రోజు ఆశించిన టాక్ రాలేదు. ఐతే ఈ టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయింది. ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే ఉన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ‘నోటా’ తెలుగు.. తమిళ భాషల్లో రిలీజవగా.. తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.7.3 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ‘గీత గోవిందం’కు రూ.10 కోట్ల దాకా షేర్ వచ్చింది. ‘గీత గోవిందం’కు రిలీజ్ చేసిన థియేటర్లు కూడా ఎక్కువ. ‘నోటా’ను దాంతో పోలిస్తే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. విజయ్ స్టార్ పవర్ ను చాటిచెప్పే వసూళ్లివి. ఐతే వీకెండ్ అంతా సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో.. ఆ తర్వాత సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.