మరోసారి చిరూ సినిమాకు డిజైనర్‌గా సుస్మిత

15:08 - September 7, 2018

సుస్మిత మరోసారి తన తండ్రి చిరంజీవి సినిమా ' సైరా ' కు డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈమె ఖైదీ 150 సినిమాకు డిజైనర్‌గా చేశారు. అయితే అది ఇప్పటి ట్రెండ్‌కు తగినది కాబట్టి అందులో చిరూ కాస్టూమ్స్‌ కు అంతగా పేరొచ్చింది. కానీ సైరా నర్శింహరెడ్డి చరిత్రకు సంబంధించింది. దీనికి కాస్టూమ్స్‌ సెలెక్ట్‌ చేయాలంటే సుస్మిత సవాల్‌ను ఎదుర్కొన్నట్టే. ఇటీవలే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అభిమానుల అంచనాలు పెంచేసింది. వచ్చే వేసవిలో విడుదల కానున్న ఈ  మెగా మూవీ అన్ని భారతీయ భాషల్లోనూ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు నిర్మాత చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్ షెడ్యూల్స్ మొదలుకుని సంగీత దర్శకుడి దాకా ఇప్పటిదాకా  సైరా పలు సవాళ్లను ఎదుర్కుంది.

అసలు సైరా కు ముందు అనుకున్న కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అంజు మోడీ. బాజీరావు మస్తానీ లాంటి సినిమాలకు పని చేసిన అనుభవంఉండటం తో తనను తీసుకున్నారు. కానీ సీమ స్థితిగతులు చరిత్ర గురించి సరైన అవగాహన లేని కారణంగా అంజు డిజైన్ చేసిన వాటిలో సహజత్వం మిస్ అవుతోందని భావించిన సూరి టీమ్ సుస్మితకే కబురు పెట్టారట.