మరింతగా అలరిస్తున్న ' ప్రేమకథ చిత్రం 2 ' టీజర్‌

16:01 - December 21, 2018

సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా ప్రేమకథ చిత్రానికి సీక్వెల్‌గా ' ప్రేమకథ చిత్రం 2 'ని  దర్శకుడు హరికిషన్ రూపొందించాడు. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ నుంచి తాజాగా టీజర్ ను వదిలారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందిత శ్వేత, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించి భయపెట్టేది ఆమెనే. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. హారర్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుధీర్ బాబు హీరోగా గతంలో వచ్చిన 'ప్రేమకథా చిత్రం' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాని మాదిరగానే  ఈ సీక్వెల్ కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.