' మన్మథుడు ' సిక్వెల్‌ రానుందట!

16:50 - November 29, 2018

విజయభాస్కర్‌ దర్శకత్వంలో, నాగార్జున హీరోగా 2002లో వచ్చిన సినిమా ' మన్మథుడు '. త్వరలో ఈ సినిమాకి  సీక్వెల్ రూపొందనుంది. ఈ సీక్వెల్ కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఆయన నాగార్జునకి కథ వినిపించినట్టుగా, ఆయన ఓకే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారనేది తాజా సమాచారం. 'మన్మథుడు 2' పేరుతో ఈ సినిమా నిర్మితం కానుంది.  కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. పాటలు పరంగా అప్పట్లో... ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటికీ ఈ సినిమాకి టీవీల్లో మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటం విశేషం. అయితే ' మన్మథుడు 2 'లో కథానయికలు ఎవరనేది, ఇంకా చిత్రానికి సంబంధించిన మరిన్ని విషియాలు త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం.