' మణికర్ణిక ' పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌

10:17 - August 21, 2018

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా టాలీవుడ్‌ ఫిలిం మేకర్‌ క్రిష్‌ బాలీవుడ్‌లో తీస్తున్న మెగా సినిమా ' మణికర్ణిక '. ఇందులో కంగనా రనేత్‌ ఝాన్సీ పాత్ర పోషిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా లాంచ్‌ చేయడం జరిగింది. ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రావాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 25 న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. ఈ చిత్ర రషేన్‌ చూసిన నిర్మాతలు కొన్ని కీలక సన్నివేశాలపై అభ్యంతరాలు చెప్పారు. ...దీంతో మళ్లీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ సన్నివేశాల్ని మళ్లీ చిత్రీకరిస్తున్నారని... అందుకే సినిమా లేటవుతోందని మీడియాలో వచ్చిన కథనాలు. అయితే దీనిపై ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. రీషఉట్‌ రూమర్లను ఆయన ఖండించారు. ' మణికర్ణిక ' నిజమైన బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
తాను రషెన్‌ చూశానని...ఔట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చిందని...సినిమాలో మార్పులు చేర్పులు ఏమీ అవసరంలేదనీ...అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని అన్నారు. సినిమా వాయిదాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఇతర పనుల వల్లే ఆలస్యమవుతుందనీ...అలాగే కొంచెం ప్యాచ్‌ వర్క్‌ కూడా ఉందని....పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంతా అయ్యేసరికి లేటవుతుందని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. అయితే ' మణికర్ణిక ' రిలీజ్‌ డేట్‌ విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరి 25కి హృతిక్‌ రోషన్‌ సినిమా ' సూపర్‌ 30 ' కూడా విడుదలకు సిద్దమవుతోంది. దీంతో కావల్సినన్ని ధియేటర్లు ఆరోజు దొరకడం కష్టమని నిర్మాతలు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.