' మణికర్ణిక ' ట్రైలర్‌ అదిరింది

15:19 - December 18, 2018

ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' చిత్రం రూపొందింది. ఇందులో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రదారిగా నటించడం జరిగింది. ఈ చిత్రానికి చాలావరకూ క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకోవడంతో, మిగిలిన భాగానికి కంగనానే దర్శకత్వ బాధ్యతను వహించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం ..యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం .. వివాహం .. ఆంగ్లేయ సైన్యంపై విరుచుకు పడటం .. భర్తను కోల్పోవడం .. వంటి ఘట్టాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కంగనా ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందనేది ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. జనవరి 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.