మట్టి.. ఒంటికి మంచిదే!

17:49 - August 27, 2018

ఒంటి నిండా మట్టిరాసుకొని కాసేపు ఎండలో ఉండటం..ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో ఒక చికిత్సా పద్ధతి! దీనివల్ల చర్మ వ్యాధులు పోతాయని,  శరీరంపై గాయాలూ నయం అవుతాయని చెబుతారు. తడిమట్టిలో చర్మవ్యాధులను పొగొట్టే ఔషధ గుణాలు ఉన్నాయని ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. అయితే ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టడం లేదు. ఒకరకమైన మట్టిలోనే ఇలాంటి గుణాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇదీ యాంటీబ్యాక్టీరియాగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సర్వేకు సంబంధించిన వివరాలను యాంటీమైక్రోబయల్‌ ఏజెంట్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.