మంత్రులు, ఎంపీలు, బడా బాబుల కూతుల్లే టార్గెట్‌గా...

11:16 - September 5, 2018

 

 

 

 

 

 

 

 

 

 

టాప్ వ్యాపార వేత్తలు.. ఎంపీలు.. మంత్రులు కూతుళ్లు, మేనకోడళ్లే లక్ష్యంగా ట్రాప్ చేశాడు. ఫేక్ ఫొటో చూయించి మాయ మాటలు చెప్పాడు. ప్రేమ పెళ్లి అన్నాడు. ఏకంగా 500 మందిని బుట్టలో పడేశాడు. దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు దోచుకున్నాడు. అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడో ఘరానా సైబర్ మోసగాడు. 

వివారాల్లోకి వెళ్తే...అతడిపేరు వంశీకృష్ణ అలియాస్‌ హర్ష తూర్పుగోదావారి జిల్లా నివాసి. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఈజీ మనీ కోసం ఫేస్బుక్, వాట్సాప్ లను ఎంచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు బడా వ్యాపార వేత్తలు, ఎంపీలు, మంత్రుల కూతుళ్లు, మేనకోడళ్లు, మనవరాళ్లే లక్ష్యంగా స్కెచ్ గీశాడు. తన ఫొటోకు బదులు ఒక అందమైన అబ్బాయి ఫొటో ఫ్రొఫైల్ పిక్ పెట్టాడు. సుమారు 500 మంది వరకు ట్రాప్ చేశాడు. మాయమాటలు చెప్పి సుమారు రెండు కోట్ల వరకు కాజేశాడు. కేవలం నెలన్నరలో 25 సిమ్ కార్డులు మార్చాడంటే ఎంత కేటుగాడో అర్థమౌతుంది. 
క్రికెట్ బెట్టింగ్ లు, గుర్రప్పందేలకు డబ్బులన్నీ తగలేస్తాడు. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర కూడా ఉందీ ప్రభుద్దుడికి. ఈ విషయాలు పోలీసుల ద్రుష్టికి రావడంతో గత కొన్ని రోజులుగా జల్లెడ పట్టి కాకినాడలో నిందితున్ని అరెస్టు చేశారు. ఇలాంటి ఫేక్‌ అకౌంట్స్‌ మాయగాల్ల మోసంలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.