మంచి ఛాన్స్‌ మిస్సయిన చరణ్‌

14:03 - September 30, 2018

తాజాగా రిలీజైన ' నవాబ్ ' సినిమాలో ఓ కీలక రోల్‌లో నటించేందుకు చెర్రీని సంప్రదించగా.. కొన్ని కారణాల వల్ల ఆయన నో చెప్పారని అంటున్నారు. ఆ తర్వాత అదే రోల్ శింబు చేయడంతో.. అతనికి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఒక విభిన్నమైన పాత్ర చేసే అవకాశాన్ని చెర్రీ చేజార్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ' నవాబ్ ' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. రెండు భాషల్లోను ఈ సినిమాను ఈ నెల 27 వ తేదీన విడుదల చేశారు. తమిళనాట ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టి.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ప్రధానమైన పాత్రల్లో కనిపించిన నలుగురు హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శింబు పాత్ర మిగతా పాత్రలకన్నా ఎక్కువగా ప్రభావం చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాత్రను రామ్ చరణ్ చేసి ఉంటే తమిళనాట ఆయన క్రేజ్ ఒక రేంజ్‌లో పెరిగేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.