' భైరవ గీత ' ట్రైలర్‌ రిలీజ్‌..

17:26 - September 1, 2018

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా భైరవ గీత. ఈ సినిమా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో తెరకెక్కుతుంది. వర్మ శిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను వర్మ తన సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. కన్నడ ట్రైలర్‌ను సాండల్‌ వుడ్‌ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ రిలీజ్‌ చేశారు.  ఈ ఫ్యాక్షన్‌ ప్రేమకథలో  ధనుంజయ్‌, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. 

వర్మ మార్క్‌ ప్రొమోషన్‌తో భైరవ గీతపై ఇప్పటికే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.