భయపడేందుకు రెడీగా ఉండండి: లారెన్స్‌

13:03 - December 22, 2018

భయపడేందుకు రెడీగా ఉండండీ అంటూ ప్రేక్షకులను హెచ్చరిస్తున్నాడు లారెన్స్‌. అదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? అసలు విషియానికి వస్తే...రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ముని’ ‘కాంచన’ ‘గంగ’ చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ముని మరియు కాంచన చిత్రాలు లారెన్స్ కెరీర్ లోనే నిలిచి పోయే సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు అదే జోనర్ లో లారెన్స్  మరో సినిమాను తెరకెక్కించాడు. ‘కాంచన 3’ అంటూ రాబోతున్న ఈ చిత్రం పై లారెన్స్ చాలా నమ్మకంగా ఉన్నాడట. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ నెలలో ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా లారెన్స్ చెప్పాడు. గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో హర్రర్ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు మరియు మలయాళం లో డబ్ అవ్వబోతున్నాయి. తెలుగు లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తామని చెబుతున్నారు.భయపడేందుకు రెడీగా ఉండండి అంటూ ముందస్తుగానే లారెన్స్ ప్రేక్షకులను హెచ్చరించాడు. గతంతో పోల్చితే ఈ సారి డబుల్ ధైర్యం తో సినిమాకు రావాలని తప్పకుండా ఇది ఎక్కువ భయపెట్టబోతుందని సినిమా పై అంచనాలు పెంచేలా లారెన్స్ కామెంట్స్ చేశాడు. పలువురు నిర్మాతలు ‘కాంచన 3’ తెలుగు రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి లారెన్స్ ఎవరి చేతిలో డబ్బింగ్ రైట్స్ ను పెడతాడో చూడాలి. అయితే...తన గత చిత్రాల మాదిరిగానే లారెన్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తమిళ బిగ్ బాస్ ఫేమ్ ఓవియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమెకు తమిళనాట భారీ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తో తెలుగులో కూడా ఆమెకు మంచి గుర్తింపు వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.