బ్యాడ్మింటన్‌ క్వీన్ గా మారిన తాప్సీ

13:13 - October 7, 2018

గతంలో తన గ్లామర్‌తో యువతను ఆకట్టుకున్న అందాల బామా తాప్సీ ఇప్పుడు రూటు మార్చింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...అదేనండీ గతంలో గ్లామర్‌కు మాత్రమే ఇంపర్టెన్స్‌ ఇచ్చి కథలు ఎంచుకున్న ఆమె..ఇప్పుడు గ్లామర్‌ కాకుండా విభిన్న పాత్రల్లో కనిపిస్తుంది. పింక్ - నామ్ షబానా చిత్రాలతో తనలో ఏదో తెలియని కొత్త గ్లింప్స్. డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్వీన్ గా తనని యూత్ గుర్తించడానికి ఆ రెండు సినిమాలు దోహదపడ్డాయి. ఇటీవల రిలీజైన ముల్క్ చిత్రంలో లాయర్గా కనిపించి షాకిచ్చింది. మొన్నటికి మొన్న `మన్మార్జియాన్`లో ఇద్దరు లవర్స్ తనంటే పడి చచ్చే గొప్ప వ్యక్తిత్వం - ఆకర్షణ ఉన్న అమ్మాయిగా కనిపించి మైమరిపించింది.   ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిగో లేటెస్టుగా సామాజిక మాధ్యమాల్లో తాప్సీ ఇచ్చిన కిల్లింగ్ లుక్ మతి చెడగొడుతోంది. రాకెట్- కాక్ చేతపట్టి బ్యాడ్మింటన్ క్వీన్ గా మారిపోయింది. సైనాకు అక్కనో - లేక సానియాకి చెల్లినో అనుకునేంత అందంగా కనిపిస్తోంది. అయితే ఇదేమీ సరదాకి కాదు. తాను పూణేకి చెందిన బ్యాడ్మింటన్ టీమ్ కి కో-ఓనర్ గా మారింది. `పీబీఎల్ ఇండియా లైవ్` టోర్నీలో `పూణే సెవన్ ఏసెస్` టీమ్ కి తాప్సీ  అండగా నిలిచింది. మొత్తానికి ఆటతో తన జీవనాన్ని సాగిస్తోందని చెప్పొచ్చు.