బొద్దుగా వున్నందుకే..నాకు ఆ ఛాన్స్‌ వచ్చింది: నిత్యా

10:24 - October 6, 2018

నిత్యామీనన్‌..ఈ మెని జూనియర్‌ సౌందర్య అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో కాస్త బొద్దుగా తయారయింది. అయినా ఆమె ఏమీ ఫిలయ్యేది కాదు. ఎవరైనా ఆమెను లావుగా వున్నావు అంటే వారికి ఘాటుగానే సమాధానం చెప్పేది. ఇవన్నీ ఇలా వుంటే...ఇప్పుడు ఈ బొద్దుగుమ్మకు మంచి ఛాన్స్‌ వచింది. అది కూడా సాదా..సీదా ఛాన్స్‌ కాదు ఏకంగా జయలలిత గారి క్యారెక్టర్‌కు ఈ అమ్మడు సెలక్టయింది. తాజాగా  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో జయలలిత లీడ్ రోల్ కు  బరువు ఎక్కువ ఉన్న హీరోయిన్స్ కోసం వెదుకుతున్న చిత్ర యూనిట్ సభ్యులు నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. లావుగా ఉన్న కారణంగా తనకు జయలలిత పాత్ర దక్కింది అంటూ నిత్యామీనన్ సంతోషంతో ప్రకటించింది. 
నిత్యామీనన్ కెరీర్ ఆరంభం నుండి కూడా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవడం తప్ప - అవకాశాల కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసేది కాదు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అయితే లావుగా వున్నావు అంటూ...అటపట్టించిన వారందరికీ ఈ సినిమాతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది నిత్యా.