బెల్లంకొండ బాబుకు ' కవచం ' కూడా కలిసిరాలేదట!

10:28 - December 11, 2018

రిలీజ్ ముంగిట ప్రతివాడూ తమ సినిమా సూపరనే అంటాడు.  సినిమా తేడా వస్తే.. జనాలు పాయింట్లు పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెడతారు. అది తట్టుకోవడం చాలా కష్టం.ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ పరిస్థితి కూడా అలాగే అయింది.  ఇప్పటిదాకా నాలుగు సినిమాలు చేసినా ఒక్క సక్సెస్ కూడా రుచి చూడని బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ‘కవచం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  ‘అల్లుడు శీను’.. ‘జయజానకి నాయక’ సినిమాలు బడ్జెట్లు పెరిగిపోవడం వల్లే కాస్ట్ ఫెయిల్యూర్లుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి చాలా జాగ్రత్త పడ్డామని.. పొదుపుగానే ఖర్చు పెట్టామని.. దీంతో ఈ చిత్రానికి రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. అంతే కాక ‘కవచం’ శాటిలైట్- హిందీ డబ్బింగ్ హక్కుల్ని రూ.20 కోట్లకు అమ్మినట్లు కూడా గొప్పలు పోయాడు. కానీ ఇప్పుడు అదంతా రివర్సయింది. ఇప్పటిదాకా హిట్టు ముఖం చూడని హీరో సినిమాకు 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ఏంటి.. ఇలాంటి హీరో సినిమా శాటిలైట్-డబ్బింగ్ హక్కుల్ని రూ.20 కోట్లకు కొనడమేంటి అన్నది జనాలకు అర్థం కాలేదు. మరీ ఈ రేంజిలో అతిశయోక్తులేంటి అని ఆశ్చర్యపోయారు. తీరా సినిమా చూస్తే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పది కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకున్న సినిమా ఫుల్ రన్లో ఐదారు కోట్ల షేర్ కూడా రాబట్టేలా లేదు. మరి ఇలాంటి సినిమా శాటిలైట్.. డబ్బింగ్ హక్కుల కోసం రూ.20 కోట్లు పెట్టిన వాళ్లు ఏమైపోవాలి అని సెటైర్లు వేస్తున్నారు.