' బీజేపీ ' పై జోక్‌ చేసిన అర్నబ్‌ గోస్వామి

14:32 - October 11, 2018

అర్నబ్ గోస్వామీ.. సీనియర్ జర్నలిస్ట్. ఇదివరకూ ‘టైమ్స్ నౌ’ చానెల్ లో డిబేట్ నిర్వహిస్తూ ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్ గా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించాడు.  2014 ఎన్నికలకు ముందు రాహుల్ ను పప్పుసుద్దను చేయడంలో ఈయన ఇంటర్వ్యూ బీజేపీకి బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత పరిణామాల్లో టైమ్స్ నౌ చానెల్ కు అర్నబ్ గోస్వామికి విభేదాలొచ్చాయి. దీంతో బీజేపీ అండదండలతో ఏకంగా ‘రిపబ్లికన్ టీవీ’ పెట్టుకొని ఇప్పుడా చానెల్ కు అన్నీ తానై నిర్వహిస్తున్నాడు. బీజేపీపై ఒకింత అమితమైన ప్రేమను కనబరుస్తున్నాడు.  మీడియా వర్గాల్లో కూడా అర్నబ్ బీజేపీకి వంతపాడుతున్నాడన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఎందుకో తెలియదు...తాజాగా బీజేపీపై అర్నబ్‌ గోస్వామి జోక్‌ బాంబ్‌ పేల్చాడు.
అదేంటో మీరుకూడా చూసి నవ్వుకోండి..ఇటీవలే రిపబ్లిక్ టీవీ-సీఓటర్ అనే సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వే చేసింది. అత్తెసరు మెజార్టీతో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. యూపీలో అఖిలేష్-బీఎస్సీ కలిసి గడిచిన ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాయి. అయినా కూడా అక్కడ బీజేపీనే గెలుస్తుందని రిపబ్లికన్ టీవీ ప్రకటించింది. ఇక మరో విచిత్రమేంటంటే.. ఏపీలో బీజేపీ 12.5శాతం ఓటు హక్కును బీజేపీ సాధిస్తుందని అర్నబ్ టీవీ చానెల్ పేర్కొనడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఏపీలో ఇప్పుడున్న ప్రధానాస్త్రం ప్రత్యేకహోదా.. ఈ విషయంలో ఏపీని బీజేపీ దారుణంగా మోసపోయిందని జనమంతా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ ఈ దెబ్బకు అధ: పాతాళానికి పడిపోయింది. కనీసం అభ్యర్థులు కూడా బీజేపీ తరఫున పోటీచేసేందుకు ఏపీలో  సాహసించడం లేదు.  కానీ రిపబ్లిక్‌ టీవీ సర్వే మాత్రం పైవిధంగా చెప్తుంది.అంతేలే వాల్ల తొత్తులు వాల్లకు సపోర్టు పలకకుండా పక్కోల్లకి పలుకుతారా?