బీజేపీ డేంజరస్‌ పార్టీ : రజనీకాంత్‌

12:19 - November 13, 2018

తమిళనాడు రాజకీయాల్ని ప్రభావితం చేసే సత్తా ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీ నోట తాజాగా వెలువడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చెన్నై ఎయిర్ పోర్ట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో మోడీ సర్కారుపై ఊహించని రీతిలో రజనీ వ్యాఖ్యలు చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించిన ప్రధాని మోడీని ప్రశంసించిన రజనీకాంత్.. తాజాగా మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా బీజేపీ డేంజర్ పార్టీగా అన్న భావన కలిగేలా ఉందన్న వ్యాఖ్య రజనీ నోటి నుంచి వచ్చింది. నోట్ల రద్దు సరిగా అమలు కాకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా చెప్పారు. బీజేపీని ప్రమాదకరమైన పార్టీగా ప్రతిపక్షాలు భావిస్తున్నందు వల్లే.. కూటమిగా జట్టు కట్టాలని భావిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి దన్నుగా నిలిచేలా వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్ అంతకు భిన్నంగా ఆయన తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పట్టటం చూస్తుంటే .. ప్రజల్లో వచ్చిన మార్పే రజనీ నోట వినిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట మోడీకి మద్దతు ఇచ్చినట్లుగా వ్యవహరించిన పలువురు అధినేతలు.. ఒక్కొక్కరుగా బీజేపీ వ్యతిరేక స్టాండ్ను తీసుకుంటున్న వేళ.. వారి బాటలోనే రజనీ నడవటం గమనార్హం.