బీజేపీని ఆర్‌ఎస్‌ఎస్‌ శాసిస్తుంది: మాణిక్‌ సర్కార్‌

13:45 - December 2, 2018

తెలంగాణ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఉందని త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ అన్నారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థికి మద్దతుగా ఆదివారం ఖమ్మంలో సీపీఎం భారీ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌, బృందా కారత్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్‌ మాట్లాడారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ శాసిస్తోందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలు దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌ కుమ్మక్కై నాటకాలు ఆడుతోందని బృందా కారత్ విమర్శించారు. కూటమి అంటూ కాంగ్రెస్, చంద్రబాబు మాయచేస్తున్నారని, కుర్చీ కోసం తప్ప ప్రజలపై ప్రేమతో కాదని ఆమె ఆరోపించారు.