బీజేపీకి ఈసారి 5 రాష్ట్రాల్లోనూ ఎదురుదెబ్బేనట!

14:53 - October 8, 2018

ప్రధాన మంత్రి మోడీగారి పనులతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఆయన గారు చేసిన నోట్లరద్దు, జీఎస్టీ, పెట్రోల్‌ పెంపు ఇవన్నీ కూడా సామాన్యుడుని ఇబ్బంది పెట్టి, ధనికులకు లాభం చేకూర్చే పనులే. మోడీ చేసిన ఏ పని కూడా సామాన్యుడుకి ఉపయోగపడింది కాదు. ఇదిలా వుంటే...
ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషియం తెలిసిందే. మిజోరం, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌ , మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వీటిల్లో మిజోరం గురించి చెప్పనక్కర్లేదు. ఇక తెలంగాణ విషియానికొస్తే ఇక్కడ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు పోటాపోటీ వుందే తప్ప బీజేపీ ఊసులేదు. ఇక మిగిలింది రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌. ఇక వీటి సంగతి చూస్తే... ఎన్నికల సర్వే రిపోర్టలకు సంబంధించిన అంచనాల విషయంలో మంచి పట్టున్న మీడియా సంస్థగా పేరున్న ఏవీపీ న్యూస్ - సీ వోటర్ సర్వే తాజాగా తమ రిపోర్ట్ ను వెల్లడించింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ తాజా ఎన్నికలు మోడీ పరివారానికి భారీ షాకివ్వటం ఖాయమంటున్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ తాజా ఎన్నికలు మోడీ పరివారానికి భారీ షాకివ్వటం ఖాయమంటున్నారు. 200 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాజస్థాన్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 142 స్థానాలు ఖాయంగా వస్తాయని.. బీజేపీకి 56 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే కంటే సచిన్ పైలట్ వైపే అత్యధికులు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.  మధ్య ప్రదేశ్లో మొత్తం 230 సీట్లు ఉంటే.. కాంగ్రెస్కు 122 స్థానాలు దక్కుతాయని.. బీజేపీకి 108 సీట్లు రావటం ఖాయమంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నా.. ఎన్నికలు జరిగే నాటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగుపడటం ఖాయమంటున్నారు. మూడో రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ లో మొత్తం 91 సీట్లు ఉండగా.. కాంగ్రెస్కు 50 సీట్లకు పైనే వస్తాయంటున్నారు. బీజేపీకి నలభై కంటే తక్కువ స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 12 నుంచి డిసెంబరు 7 వరకూ ఎన్నికలు జరుగుతాయి. పలితాలు మాత్రం ఐదు రాష్ట్రాలకు డిసెంబరు 11న ఒకేసారి వెల్లడిస్తారు. ఏదిఏమైనా సర్వే అంచనాల ప్రకారం ఇప్పుడు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్ల్లో బీజేపీకి ఓటమి తప్పనట్లుంది.