బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లిపై దాడి...

15:24 - October 30, 2018

తెలంగాణ సీనియర్‌ రాజకీయ నాయకుడు, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్‌ నేత బూడిద బిక్షమయ్యగౌడ్‌ అనుచరులు రెచ్చిపోయి మోత్కుపల్లిరపై దాడికి దిగారు. ఆ సమయలో అక్కడే వున్న బిక్షమయ్య గౌడ్‌ తన అనుచరులను వారించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో తమపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈరోజు చోటుచేసుకంది. బీఎల్‌ఎఫ్‌ ఇటీవల విడుదలచేసిన రెండో విడత అభ్యర్థుల జాబితాలో మోత్కుపల్లి పేరును వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆలేరులో బీఎల్‌ఎఫ్‌ టిక్కెటు పై మోత్కుపల్లి పోటీ చేయడం ఖరారైంది. దీంతో ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రచారం చేస్తున్న మోత్కుపల్లికి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎదురుపడి దాడికి దిగడం జరిగింది.