బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న గొడవలు

13:28 - September 19, 2018

బిగ్‌ బాస్‌ చివరి దశ వస్తుంది. దీంతో హౌజ్‌లో టాస్క్స్‌ కూడా చాలా కఠినంగా వుంటున్నాయి. దీంతో గెలవాలనే పోటీతత్వంతో ఒకరిపై ఒకరికి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కౌశల్‌, తనిస్‌కు శారీరకంగా దెబ్బలు తగిలేంతగా గొడవలు జరుగుతున్నాయి.

నిన్నటి ఎపిసోడ్ లో రేస్ టు ఫినాలే టాస్క్ ను నిర్వహించడం జరిగింది. ఆ టాస్క్ లో భాగంగా  ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోతారు. గార్డెన్ ఏరియాలో ఉన్న మూడు కంటేనర్స్ లో ఇసుక నింపి ఉంది. ఆ ఇసుకను ఒక టీం సభ్యులు కాపాడుకోవాల్సి ఉండగా - మరో టీం సభ్యులు మాత్రం దాన్ని కింద పోసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. 

ఈ గేమ్‌లో సామ్రాట్‌, తనిష్‌ మాత్రం కౌశల్‌పై వారికున్న కోపం మొత్తాన్నీ ప్రదర్శించడం జరిగింది. అది ఎంతగా అంటే వారు ఫినాలేకి వెల్లకపోయినా పర్వాలేదు కానీ.. కౌశల్‌ మాత్రం వెల్లకూడదు అన్నది అక్కడ కనిపించింది.

ఒక టీంగా కౌశల్ - రోల్ రైడా - గీత మరోటీం సభ్యులుగా దీప్తి - తనీష్ - సామ్రాట్ లు ఉన్నారు. కౌశల్ - రోల్ రైడా - గీతలు ఇసుక కంటేనర్స్ ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ముగ్గురు ఆ ఇసుకను కింద పోసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కౌశల్ కంటేనర్ లోని ఇసుకను తనీష్ మరియు సామ్రాట్ లు పూర్తిగా కింద పోయడంతో పాటు కంటేనర్ మొత్తం విరగొట్టారు. ఆ తర్వాత రోల్ రైడా కంటేనర్ ను ఖాళీ  చేసేందుకు కౌశల్ ప్రయత్నించాడు. అయితే అనూహ్యంగా రోల్ రైడాకు సామ్రాట్ మరియు తనీష్ లు మద్దతుగా నిలిచారు.

కౌశల్ - రోల్ రైడా కంటేనర్ ను ఖాళీ  చేయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డు వచ్చిన తనీష్ తో గొడవ జరిగింది. ముఖ్యంగా తనీష్ మరియు కౌశల్ లు శారీరక హింసకు పాల్పడ్డారు. ఒకరిని ఒకరు గాయ పర్చుకునే వరకు వెళ్లారు. మరో వైపు గీత కంటేనర్ ను దీప్తి ఖాళీ  చేయించేందుకు ప్రయత్నించి సఫలం అయ్యింది. తనీష్ - కౌశల్ ల వివాదం పెరగడంతో పాటు - ఫైట్ మరింత ముదిరే అవకాశం ఉందని భావించిన బిగ్ బాస్ వెంటనే టాస్క్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

కౌశల్ మరియు తనీష్ లపై బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యాడు. ఒకరిపై ఒకరు శారీరక హింసకు దిగవద్దని పదే పదే చెప్పినా కూడా బిగ్ బాస్ ఆదేశాలను పట్టించుకోకుండా వారిద్దరు గొడవ పడటంతో ఇద్దరిని బయటకు పంపిస్తానంటూ బిగ్ బాస్ హెచ్చరించాడు.