బిగ్‌ బాస్‌ ఫైనల్‌ వీకెండ్‌లో కఠినమైన టాస్క్స్‌

13:13 - September 7, 2018

బిగ్‌ బాస్‌ చివరి దశకు వచ్చింది. దీంతో బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యులకు  ముందిచ్చిన వాటికన్నా కఠినమైన టాస్క్‌లను ఇస్తున్నారు. ఇంటి సభ్యులు కూడా రసవత్తంగా పోటా పోటీగా ఆడుతున్నారు. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు.. అలాగే ఎలిమినేషన్ కాకుండా ఉండేందుకు తాజాగా ఓ కారు టాస్క్ ను హౌస్ మేట్స్ కు ఇచ్చాడు. ఈ కారు టాస్క్ లో సైరన్ మోగగానే హౌస్ మేట్స్ అంతా గార్డెన్ ఏరియాలో ఉన్న కారులోకి ఎక్కాలి.. మొదట ఎక్కిన ఐదుగురు ఇంటిసభ్యులు ఫైనల్ వీకెండ్ కు వెళతారని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. 

కారులోకి ఎక్కిన ఐదుగురు ఇంటి సభ్యులు 24 గంటల పాటు కారులోనే వుండాలని, అలా కాకుండ కారు దిగితే వారు నామినేషన్‌కు వెళ్తారని బిగ్‌ బాస్‌ చెప్పడం జరిగింది. ఈ ఆసక్తికర టాస్క్ లో మరో ట్విస్ట్ ఏంటంటే.. 24 గంటలకు మించి కారులో ఐదుగురి కంటే ఎక్కువమంది ఉంటే ఎవ్వరూ ఫైనల్ వీక్ లోకి వెళ్లే చాన్స్ ఉండదు. దీంతో హౌస్ మేట్స్ అందరూ మిగతా వారిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది.ఎవ్వరూ ఓడిపోవడానికి ఒప్పుకోరు కాబట్టి ఈ టాస్క్ బాగా పేలుతోంది. గొడవలు అలకలు కన్విన్స్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 

కౌశల్ ఈ సీజన్ మొత్తానికి నామినేషన్ లో ఇదివరకే ఖరారు కావడంతో బిగ్ బాస్ అతడిని ఈ టాస్క్‌కు సంచాలకుడిగా నియమించారు. ఇక రోల్ రైడా బజర్ మోగకముందే కారును టచ్ చేయడంతో నిబంధనల ప్రకారం అతడు ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్టు కౌశల్ ప్రకటించాడు. ఇక ఈ కారు టాస్క్ లో తనీష్ - సామ్రాట్ - దీప్తి - శ్యామల - గీతామాధురిలు కారులోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకైతే ఫైనల్ రేసులో ఉన్నారు. వీరిలో 24 గంటల పాటు కారులో ఎవరు వుంటారు?.. ఎవరు దిగుతారు అనేది ఈరోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే...