బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌ ఎవరు...? మరికొన్ని గంటల్లో...

12:20 - September 30, 2018

బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఈరోజుతో ముగియనుంది. ఎందరో ఎదురుచూస్తున్న ఫైనల్‌ విన్నర్‌ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌, 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఒక ట్రెండ్‌ సృష్టించింది. హౌజ్‌లో గొడవలు, ఆటలు, పాటలు రిలేషన్స్‌, ఎమోషన్స్‌ వీటన్నిటితో ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజారు చేశారు. చూసే ప్రతి ప్రేక్షకుడూ కూడా నేనే ఆడుతున్నా అన్నంతగా ఈ షోకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఏ ఛానల్‌ చూసినా, ఎవరి నోట విన్నా విన్నర్‌ ఎవరూ...?, రన్నర్‌ ఎవరు అవుతారో అన్న ఉత్కంఠ వుంది. అయితే కౌశల్‌ కు బయట ఎంత ఫాలోయింగ్‌ వుందో...కౌశల్‌ ఆర్మీ ని చూస్తే అర్థమవుతుంది. ఇంతగా ఫాలోయింగ్‌ ఏ కంటెస్టెంట్‌కు లేదు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్‌బాస్‌ సెట్‌ ముందు శనివారం రాత్రి సుమారు మూడు వందల మంది కౌశల్‌ ఆర్మీ సభ్యులు కౌశల్‌...కౌశల్‌ అని అరుస్తూ హల్‌ చల్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్‌ షఉట్‌ను బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తుంది. అంతేకాక సెట్‌ చుట్టూ అనేక పోస్టర్లు అండించారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కౌశల్‌ ఆర్మీ షఉట్‌ను ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక పోలింగ్స్‌ను బట్టి ఇప్పటికే అందరికీ విన్నరెవరో అర్ధమయివుండోచ్చు. అయినా సరే బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు.