బిఎల్‌ఎఫ్‌లోకి భారీ చేరికలు

17:52 - November 9, 2018

మానుకోట పట్టణంలో బిఎల్‌ఎఫ్‌ బహిరంగ సభ జరిగింది ఈ సభలో మహబూబాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థి, ఇతర సామాజిక సంఘాల నుంచి భారీ సంఖ్యలో యువకులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా బిఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌, బిఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం బిఎల్‌ఎఫ్‌ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిఎల్‌ఎఫ్‌ ఒక ప్రభంజనంగా మారుతుంది. బిఎల్‌ఎఫ్‌లోకి రాష్ట్రం నుంచి అనేకమంది మేదావులు చేరుతున్నారు, దీన్ని బట్టి బిఎల్‌ఎఫ్‌ బలం ఏంటంటే...93% మంది ప్రజలు బిఎల్‌ఎఫ్‌ పక్షాన వున్నారని అన్నారు. బిఎల్‌ఎఫ్‌ అంటే అన్ని పార్టీలలాగా కాదు. లాల్‌ నీల్‌ జెండాలు కలిసిన పార్టీ. ఇది మాటల పార్టీ కాదు చేతల పార్టీ అన్నారు. ఇల్లు, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే మన బతుకులు మారినట్లు అని తెలిపారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేదల బతుకులు మారలేదు. కానీ బిఎల్‌ఎఫ్‌ ఎజెండా మాత్రం పేదల బతుకులు మార్చడమే అని ఆయన అన్నారు.