' బాహుబలి 2 ' ఓపినింగ్‌ రికార్డును..' సర్కార్‌ ' బ్రేక్‌ చేస్తుందా?

16:55 - October 26, 2018

ఇళయదళపతి విజయ్ తాజా చిత్రం 'సర్కార్' నవంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'తుపాకి'.. 'కత్తి' తర్వాత విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సర్కార్ వారికి హ్యాట్రిక్ చిత్రం. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం.. కొత్త పార్టీల పుట్టుక..  వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా పొలిటికల్ హీట్ పెంచడం కూడా ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.  దానికి తగ్గట్టే సినిమా థియేట్రికల్ రైట్స్ భారీగా రూ. 120 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. శాటిలైట్.. డిజిటల్ రైట్స్ ఇతర హక్కులన్నీ కలిపితే 'సర్కార్' రూ. 170 కోట్ల బిజినెస్ చేసిందని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి భారీ స్థాయిలో 200 బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారట. చెన్నై సిటీలోనే 100 బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారట.  ఈ లెక్కన తమిళనాడులో 'బాహుబలి 2' పేరిట ఉన్న ఓపెనింగ్ రికార్డులను విజయ్ చిత్రం బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ - మురుగదాస్ గత చిత్రం 'కత్తి' లో ప్రభుత్వం పై సూటిగా విమర్శలు చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఈసారి 'సర్కార్' పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి ఆ డోస్ మరింతగా పెంచి ఉంటారని స్పెక్యులేషన్స్ కూడా ప్రచారం లో ఉన్నాయి.