బాల్య స్నేహం...ఇప్పటికీ అలాగే..!

14:45 - October 13, 2018

స్నేహం ఎన్ని కోట్లిచ్చిన కొనలేనిది. అదే బాల్య స్నేహమైతే ఎంతోమందిలో కొంతమందికి మాత్రమే అది కొనసాగుతుంటుంది. అలాంటిదే వీరిద్దరిదీ కూడా...శ్రీకృష్ణుడి ఫ్రెండు కుచేలుడు అటుకులు తెచ్చి ఫ్రెండుకి పెట్టిన చందంగా ఈయన కూడా రజనీతో కలిసి అటుకులు తిన్న గ్రేట్ ఫ్రెండ్. పేరు రామకృష్ణ. చిన్ననాటి స్నేహితుడు. కలిసే చదువుకున్నారు. పెద్దయ్యాక ఎవరి రంగాల్లో వాళ్లు ఎదిగారు. రజనీకాంత్ సినీఆరంగేట్రం చేసేప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాటి క్రమం నేడు రాజకీయారంగేట్రం చేస్తున్నప్పటి పరిణామాల వరకూ పూస గుచ్చినట్టు చెప్పేయగలడు. ఇదిగో మరోసారి ఫ్రెండు రజనీని కలిశాడు. అటుకులు తెచ్చాడా.. లేదా? అన్నది అటుంచితే ఈ ఫోటోలో ఆ ఇద్దరి మధ్యా ఆప్యాయత గుండెల్ని కుదిపేస్తోంది. దస్త్ మేరా దోస్త్! తూహై మేరా జాన్! అన్న తీరుగా స్నేహితులిద్దరూ సరదా సరదాగా ఎలా ఉన్నారో ఎంచక్కా!! రాజకీయాల్లో దూసుకుపో అంటూ ఫ్రెండు తొందర పెట్టేస్తున్నట్టే ఉంది. కాస్త ఆగవయి ఫ్రెండూ.. ఆ సినిమాలేవో పూర్తి చేశాక మొదలెడదాం.. అని రజనీ నవ్వేస్తున్నాడన్నమాట!!. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించగానే ముందుగా స్పందించింది ఈ కుచేలుడే. నాడు ఓవైపు రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే.. నిస్వార్థంగా రాజకీయాల్లోకి వస్తున్నాడు! ఈసారి రాజకీయాలు మారతాయి! అంటూ ప్రకటించిన గ్రేట్ ఫ్రెండు రామకృష్ణ.