బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకు లైన్‌ పెరిగిపోతుందట!

17:35 - December 19, 2018

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరో అంటే విజయ్ దేవరకొండ పేరు మొదట వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి గీత గోవిందం చిత్రాలతో యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఇటీవలే ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలివుడ్‌లో మంచి క్రేజ్‌ వున్న హీరోగా పేరుతెచ్చుకున్న దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఎలా వార్తల్లో నిలుస్తున్నాడో చూద్దాం..తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటే తనకు చాలా బాగా ఇష్టమని చెప్పింది. అదే సమయంలో కరణ్ జోహార్ తాను ఒక సినిమాను విజయ్ దేవరకొండ తో చేయాలనుకుంటున్నట్లుగా చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆధిత్య చోప్రా కూడా మెల్లగా విజయ్ దేవరకొండ కు లైన్ వేస్తున్నట్లు గా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరణ్ జోహార్ మరియు ఆధిత్య చోప్రాలు త్వరలోనే విజయ్ దేవరకొండను బాలీవుడ్ కు తీసుకు వెళ్లేందుకు విడి విడిగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో కాని ప్రస్తుతం అక్కడ విజయ్ దేవరకొండ పేరు మాత్రం మారుమ్రోగిపోతుంది.