బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ

14:59 - December 22, 2018

తెలుగులో చాలా తక్కువ చిత్రాలతోనే స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ, 'నోటా' సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాట్లు సమాచారం. కోలీవుడ్‌లో సినిమా తీసిన దగ్గర నుంచి ఆయన హిందీలోనూ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్న విజయ్ దేవరకొండ, ఇప్పట్లో హిందీలో చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే నిజంగానే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైపోతోంది. 1983లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో హిందీలో '1983' టైటిల్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో అప్పటి మ్యాచ్ విజయంలో కీలకమైన పాత్రను పోషించిన శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకున్నారనేది తాజా సమాచారం. కపిల్ దేవ్ పాత్ర కోసం ఆల్రెడీ రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ దూకుడు ఒక రేంజ్ లోనే వుంది.