బాలివుడ్‌లో కూడా గీతా గోవిందం హవా..

17:57 - August 20, 2018

అర్జున్‌ రెడ్డిగా నటించిన Vijay... గోవిందుడిగానూ ప్రేక్షకులను మెప్పించేశాడు. Vijay Devarakonda వరుస హిట్‌లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. వసూళ్లలో ఈ సినిమా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ' గీతా గోవిందం 'కు ఎదురులేకుండా పోయింది. ఇది ఇక్కడే కాక ఓవర్సిస్‌లో కూడా దూసుకెళ్తుంది. అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్‌ డాలర్లను కలెక్ట్‌ చేసింది. 
అక్షరుకుమార్‌ నటించిన ' గోల్డ్‌ ', జాన్‌ అబ్రహం హీరోగా వచ్చిన ' సత్యమేవజయతే ' సినిమాలు ఆస్ట్రేలియాలో ' గీతా గోవిందం 'ధాటికి నిలబడలేక పోతున్నాయి. ఈ రెండూ కలిసి 1.92లక్షల డాలర్లు వసూళ్లు చేయగా గీతా గోవిందం మాత్రం రెండు లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసిందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్‌ చేశారు. దీనిని బట్టి చూస్తే Vijay Devarakonda హవా ఏరేంజ్‌లో ఉందో అర్ధమవుతుంది. పరుశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించింది.