బాలయ్య ఆ కార్యక్రమానికి చిరుని ఆహ్వానించారా? లేదా?

13:10 - December 21, 2018

బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను నేడు నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు నందమూరి ఫ్యామిలీతోపాటు, టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోలు మరియు ప్రముఖులు ఎంతో మందిని బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించాడట. అయితే ఈ ఆహ్యానించినవాల్లలో మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం లేనట్టు తెలుస్తుంది. గతంలో తన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి చిరంజీవిని ఆహ్వానించిన బాలయ్య ఈసారి మాత్రం చిరంజీవిని పక్కకు పెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు. కృష్ణ - కృష్ణంరాజు - మోహన్ బాబు వంటి ప్రముఖులను బాలయ్య స్వయంగా ఆహ్వానించినట్లుగా నందమూరి వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే రాజకీయ కారణాల వల్లే చిరంజీవిని ఈ కార్యక్రమంకు ఆహ్వానించడం లేదని ఒక వర్గం వారు భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ఉంటుందని మొదట ప్రచారం జరిగినా ఆ పాత్రను బాలయ్య వద్దని దర్శకుడికి చెప్పడంతో తీసేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరంజీవికి ఆహ్వానం అందలేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.