బాబుని ఫాలో అవమంటున్న కేసీఆర్‌..

10:50 - October 22, 2018

నిన్నటి దాకా సభలల్లో నోటికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని తిట్టిన కేసీఆర్‌ ఈరోజు బాబుని ఫాలో అవమంటున్నారు. అవునండీ..ఇది నిజమే..వివరాల్లోకి వెళితే...2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.''  అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రయోజనం పొందిన ప్రతి లబ్ధిదారుడిని ఆ పార్టీ నేతలు కలిశారు. మొదటి గంటలోనే వారిని పోలింగ్‌ బూత్‌కు రప్పించారు. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ శిబిరంపై కన్నేశారు. లబ్ధిదారులందరినీ పోలింగ్‌ బూత్‌కు రప్పించడం ద్వారా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇప్పుడు మీరూ అదే వ్యూహాన్ని అనుసరించాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడిని కలవాలి. మొదటి గంటలోనే పోలింగ్‌ బూత్‌కు తీసుకు రావాలి '' అని పార్టీ అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించారు. అప్పట్లో జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించి ఓటమి పాలయ్యారనిఅందువల్ల నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.