బాధను దిగమింగుకొని...బాధ్యత నెరవేరుస్తున్నారు

13:47 - September 1, 2018

తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగుకొని....కర్తవ్యాన్ని గుర్తుచేసుకొని సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి హరికృష్ణ తనయులు సిద్దమయ్యారు. శనివారం నుంచి ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రీకరణలో ఎన్టీఆర్‌, సోమవారం నుంచి కె.వి. గుహన్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణలో కల్యాణ్‌రామ్‌ పాల్గొంటున్నారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాను దసరాకు విడుదల చేద్దాం అనుకున్నారు. ఆ డెడ్‌లైన్‌ మీట్‌ అవ్వడం కోసం ఆల్రెడీ చిత్రబృందం ఫుల్‌ స్పీడ్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పుడు తన వల్ల షూటింగ్‌ ఆలస్యం కాకూడదని ఆలోచించారు ఎన్టీఆర్‌.  మరోవైపు కల్యాణ్‌ రామ్‌ కూడా ఇదే విధంగా ఆలోచించారు. కెమెరామేన్‌ కేవీ గుహన్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ చేస్తోన్న  ఓ థ్రిల్లర్‌ మూవీ షూటింగ్‌లో కల్యాణ్‌ రామ్‌ పాల్గొంటున్నారు.