బాక్సాఫీస్‌ రన్‌ పూర్తిచేసుకున్న టాక్సీవాలా

13:17 - December 18, 2018

నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాక్సీవాలా' , తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, ప్రియాంక జవాల్కర్ .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా, అన్ని ప్రాంతాలలోను బాక్సాఫీస్ రన్ పూర్తిచేసుకుంది. ఓవరాల్ గా 21.28 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 7.70 కోట్ల షేర్ ను సాధించగా .. ఓవర్సీస్ లో 3 కోట్ల షేర్ ను రాబట్టింది. వసూళ్ల పరంగా 'గీత గోవిందం' .. 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత స్థానంలో నిలిచింది.