బన్నీ బాబు వేసుకున్న టీషర్ట్‌, షూ ధర ఎంతో తెలుసా?

15:53 - November 16, 2018

ఇటీవల జరిగిన '  టాక్సీవాలా ' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం బన్నీ '  GIVENCHY ' అనే ఫేమస్ బ్రాండ్ టీషర్టు '  SPEED TRAINERS ' అనే షూ ధరించి ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ టీషర్ట్ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అయితే అక్కడే వుంది అసలు విషియం...ఆ టీషర్ట్‌ ధర రూ. 65 వేలు, షూ వచ్చేసి రూ.52,120. ఈ రెండింటి ధర రూ.లక్షా పదిహేడు వేలు. ఇది తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో...ఈ ఈవెంట్‌లో '  టాక్సీవాలా ' కు సంబంధించి లేదంటే విజయ్ దేవరకొండకు సంబంధించి బన్నీ చెప్పిన విషయాలేమీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవలేదు కానీ ఆయన వేసుకొచ్చిన టీషర్ట్, షూస్ మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి.