బన్నీ ఇక ఆ సినిమాకి నో చెప్పేసినట్టేనట!

14:05 - December 3, 2018

ఇతర బాషల్లో ఎంత పెద్ద హిట్ అయిన సినిమాలైనా రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు సదరు హీరో తన బాడీ లాంగ్వేజ్ కి ఇమేజ్ అది సెట్ అవుతుందా లేదా అని చూసుకోవడం చాలా అవసరం. లేదంటే పక్క బాషలో క్లాసిక్ అనిపించుకున్నది ఇక్కడ డిజాస్టర్ అయిపోతుంది. ఇదే నేపథ్యంలో...తమిళ్ లో కల్ట్ క్లాసిక్ గా విమర్శకులను సైతం మెప్పించిన 96 రీమేక్ గురించి గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. నాని చేస్తాడని టాక్ వచ్చింది కానీ జెర్సి తో పాటు విక్రమ్ కుమార్ మూవీకి బ్లాక్ అయిపోవడంతో నో చెప్పేసాడు. అల్లు అర్జున్ ఇంతకుముందే  ప్రత్యేకంగా షో వేయించుకుని చూసాడు. దాని రీమేక్ హక్కులు కొన్న దిల్ రాజు బన్నీ ఏమైనా ఓకే చెప్తాడేమో అని ఎదురు చూసినట్టుగా కూడా టాక్ ఉంది. కానీ ఫైనల్ గా బన్నీ 96 రీమేక్ తనకు సెట్ అవ్వదని డ్రాప్ అవుతున్నట్టుగా దిల్ రాజు కు స్పష్టంగా చెప్పేశాడట. నిజానికి 96 రీమేక్ అల్లు అర్జున్ చేయొచ్చు అనే టాక్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంత ఖంగారు పడ్డారు. మరీ అంత ఫీల్ గుడ్  స్లో స్టోరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి నిజంగానే సెట్ కాదు. ఏదో ప్రయోగం పేరుతో చేసినా కథ ఫలితం ఇవ్వలేకపోతే నా పేరు సూర్య తర్వాత కోరి మరీ తీసుకున్న ఏడు నెలల ఎదురుచూపులు వృధా అయిపోతాయి. అందుకే అన్ని కోణాల్లో అలోచించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఎలాగూ వర్క్ జరుగుతోంది కాబట్టి ఇంకొద్ది రోజులు ఆగాలి తప్పించి 96 వద్దనుకున్నట్టు తెలిసింది.