ఫ్రంట్‌ పేరిటా కేసీఆర్‌ తీర్థయాత్ర...!

17:42 - December 22, 2018

సీఎం కేసీఆర్‌ ఫ్రంట్‌ పేరిట చేపడుతున్నది రాజకీయ యాత్రా...? లేక పలు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శన కసం సాగుతున్న తీర్ధయాత్రనా...? అనే ప్రశ్న తలెత్తకమానదు. సీఎం కేసీఆర్‌ను వేలెత్త చూపించే ప్రతిపక్ష నేత ఎవరు? అంటే క్వశ్చన్‌ మార్కే. అసలు విషియానికి వస్తే...సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం రేపటి నుంచి పలు రాష్ట్రాల యాత్ర ప్రారంభం కానుంది. అందుకు అధికారిక షెడ్యూల్‌ కూడా సీఎఓ నుంచి వెలువడంది. ఆ పర్యటన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రారంభంకానుండటం విశేషం. అయితే ఏపిలో విశాఖ శారదా పీఠంలో పూజలు చేయడంలో శ్రీకారం చూట్టనున్నారు. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశంకానున్నారు. అనంతరం కోణార్క్‌ పూరీ దేవాలయాన్ని సందర్శించనున్నారు. 24న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతతో భేటీ కానున్నారు. అక్కడ కాళికామాతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇలా ఫ్రంట్‌ పేరిట ఆయా రాప్ట్రాల నేతలతో బేటీ కావడంతో పాటు అక్కడ పుణ్యక్షేత్రాల్లో దైవదర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ స్వామికార్యం స్వకార్యం రెండు ముగించుకొని రావడం భాగానే ఉంది. కానీ ఫ్రంట్‌ రాజకీయాల కోసం అందరినీ కలిసిన తర్వాత ఆఖరికి మర్యాదపూర్వకంగా పీఎం మోదీతో ఢిల్లీలో భేటీ అవుతారట!. అంటే ఫ్రంట్‌ రాజకీయ యాత్ర పరమార్థం ఏంటి? అనే ప్రశ్న తలెత్తకమానదు. ఒక వేళ దేవాలాల సందర్శన కోసమే అయితే మళ్లీ ఫ్రంట్‌ ముసుగులో వెళ్లడం దేనికి, నిశ్చింతగా దైవదర్శనం చేసుకోని వస్తే సరిపోతుంది కదా!. స్వామికార్యం, స్వకార్యం రెండూ వ్యక్తిగతం అయినప్పుడు ప్రత్యేక విమానం కోసం ప్రజాధనం వృధా చేయడం దేనికి? అనే సందేహం రాకమానదు. అయిన నో కామెంట్‌.
తెలంగాణ రాజకీయ రంగస్థలం పై ప్రస్తుతానికి గులాబీ బాసే రారాజు ఇందులో ఏ సందేహంలేదు. కానీ ఏ నాటకం రక్తి కట్టాలన్నా...అందులో కధానాయకుడు ఎంత బలంగా ఉంటాడో..ప్రతినాయకుడు కూడా అంత సమవుజ్జి బలంతో ఉండాలి. అదీ రాజకీయాల్లో అయితే మరీ అవసరం. ఇక్కడ కథను గమనం అంటే ప్రజలు కోరుకునే పాలన. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రశ్నించే నిర్మాణాత్మక ప్రతిపక్షమే కీ రోల్‌. కానీ తెలంగాణ రాజకీయ యావనీకపై అది లోపించందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ సీఎం కేసీఆర్‌ స్టాటజీతో పోటీ పడగల నేతలెవరూ..అంటే ఇప్పటికైతే సైలెన్సే సమాధానం.