ఫోన్‌ చేసి మీ ఏటిఎం వివరాలు అడుగుతున్నారా?..అయితే ఇలా చేయండి

11:20 - December 22, 2018

అపరిచిత ఫోన్‌ కాల్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఫోన్‌ చేసిన అవతలి వ్యక్తి మీకు ఏ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉంది ఉంటే ఏటీఎం కార్డు ఉందా, మీ ఏటీఎం కార్డు ఈనెలా ఖరులోగా రినివల్‌ చేసుకోకపోతే మీ లావాదేవీలు ఆగిపోతాయి అంటూ గౌరవ ప్రదంగానే మట్లాడుతూ ఏటీఎం పైన ఉన్న 16 అంకెల నంబరును, పిన్‌ నంబరును తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది అమాయక జనం దీన్ని నమ్మి తమ వివరాలను వెల్లడించి అకౌంట్లో ఉన్న డబ్బులను దొంగల పాలు చేసి లబోదిబో మంటున్నారు. ఉదాహరణకు రెండు నెలల క్రితం శెట్పల్లికి చెందిన ఒక గిరిజన రైతుకు ఫోన్‌ చేసి వివరాలు సేకరించి రూ.30 వేలు కాజే శారు. ఇలా మండలంలో అనేక మంది అమాయకులు ఉన్నారు. తాజాగా వస్తున్న ఈకా ల్స్‌ పట్ల చదువుకొన్న కొందరు బ్యాంక్‌ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ విషయమై బ్యాంక్‌ అధికారులు ఏటీఎం నంబరుకాని, పిన్‌ నంబర్‌ కాని అంత్యంత గోప్యంగా ఉంచాలని ఎవరికి వెళ్లడించకూడ దని పేర్కొంటున్నారు. తె లిసో తెలియకో పిన్‌ నంబర్‌ లు వెల్లడించిన పక్షంలో వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి, పిన్‌ నంబర్‌ మార్పు చేసుకుంటే మోసపోకుండా ఉండగలరు. ఏటీఎంపైన కార్డు గడువు తేదీ పేర్కొన బడి ఉంటుంది కాబట్టి సంక్షిప్త సందేశం ద్వారా అపరిచిత ఫోన్‌కాల్స్‌ ద్వారా ఏటీఎం కార్డుల వివరాలు అడిగితే అపరిచితులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా బ్యాంక్‌ అధికారులను సంప్రదించి తమ సందేహాలునివృత్తి చేసుకోవాలని బ్యాంక్‌ అధికారులు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులు, బ్యాంక్‌ అధి కారులు ఖాతాదారులను చైతన్య పరిచే దిశగా చర్యలు తీ సుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.