ఫైల్‌ ట్రాన్స్ఫర్‌ చేసేందుకు 5 బెస్ట్‌ ఫ్రీ ఆండ్రాయిడ్‌ యాప్స్‌...

14:11 - August 18, 2018

మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి ఎటువంటి వైర్‌ లేకుండా ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఫైళ్లను, ఫోటోలను, వీడియోలను పంపాలనుకుంటే ఈ 5 బెస్ట్‌ ఫ్రీ ఆండ్రాయిడ్స్‌ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
1. షేర్‌ ఇట్‌, 2. జెండర్‌, 3. సూపర్‌ బీమ్‌, 4. పోర్టల్‌, 5. వైఫై shoot
1. షేర్‌ ఇట్‌:- మొదట మీ ఫోన్లో షేర్‌ ఇట్‌ ని ఇన్స్టాల్‌ చేసుకోవాలి. మీరు డీటాను పంపించాలనుకుంటున్నా లేదా క్రమం చేయాలనుకుంటున్నా...మీ ఫోన్లో షేర్‌ ఇట్‌ యాడ్‌ ఇన్స్టాల్‌ చేయాలని గుర్తుంచుకోండి. షేర్‌ ఇట్‌ ద్వారా మీ ఫోన్‌లోని డేటాను. మరొక ఫోన్‌లోకి ఇంపోర్ట్‌ చేయవచ్చు మరియు ఎక్స్‌ పోర్ట్‌ చేయవచ్చు.
2. జెండర్‌:- ఈ యాప్‌ నుండి మీరు వైఫై ద్వారా ఫైల్స్‌ని కూడా షేర్‌ చేయవచ్చు. ఇది ఒకేసారి అనేక డివైసెస్‌లో ఫైళ్లను షేర్‌ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. జెండర్‌ అనేది షేర్‌ ఇట్‌ కు సమానమైన యాప్‌ కాబట్టి మీరు సులభంగా డేటాని షేర్‌ చేయవచ్చు.
3. సూపర్‌ బీమ్‌:- ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మరియు టాబ్లెట్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేయడం ఈ యాప్‌ ప్రత్యేకత. సూపర్‌ బీమ్‌ మీ డివైస్‌ యొక్క జతని NFC మరియు QR  కోడ్‌తో చేస్తుంది. ఈ కారణంగా సూపర్‌ బీమ్‌ మీరు క్లిక్‌ చేయకుండా షేర్‌ చేసే ఫెసిలిటీని ఇస్తుంది. దీనిలో షేర్‌ ఇట్‌ మరియు జెండర్‌ వంటి ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. 
4. పోర్టల్‌:- దీని ద్వారా ఫైల్స్‌, ఫోల్డర్లు, పాటలు, వీడియోలను కంప్యూటర్ల నుండి ఫోన్‌లోకి కూడా పంపవచ్చు. దీని కోసం ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయండి మరియు, ఇన్కమింగ్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి మరియు ఫైళ్లను ట్రాన్స్ఫర్‌ చేయండి.
5. వైఫై shoot :- ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి వైర్లెస్‌ షేరింగ్‌ అప్లికేషన్‌. ఆండ్రాయిడ్‌ ఫోన్లు షేర్‌ చేయడం దీంతోనే ప్రారంభమైంది. వైఫై shoot  అనేది పాటలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను షేర్‌ చేయడానికి ఒక మంచి ఆప్షన్‌.