ఫిక్సయిన నోటా రిలీజ్ డేట్

' నోటా ' రిలీజ్ డేట్ అక్టోబర్ 5కి ఫిక్సయింది. 5న ప్రపంచవ్యాప్తంగా ' నోటా ' రిలీజ్ కానుంది. ' గీత గోవిందం ' పెద్ద సెక్సెస్ తరువాత విజరు దేవరకొండ నటిస్తున్న ' నోటా ' సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో పవర్ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేయడం విశేషం. ఈ సినిమా విజయ్ కెరీర్ లో మొదటి ద్విభాషా చిత్రం. మొదటి సరి విజయ్ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ తమిళంలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో తమిళ యూత్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ఆనంద్ శంకర్ దర్శకుడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ - నాజర్ ఇతర కీలక పాత్రలలో నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించాడు.