ప్రేమ కోసం ఆ యువరాణీ... సింహాసనాన్నే ఒదులుకుంది!

17:11 - October 30, 2018

ఈ మధ్య కాలంలో ప్రేమిస్తే చంపెయడాలు ఎక్కువగా చూశాము. అయితే జపాన్‌లో అలా జరగలేదు. అక్కడి కథ వింటే ఇవన్నీ సినిమాల్లో, కథల్లో జరుగుతాయి కానీ..నిజ జీవితంలో జరుగుతాయా? అని అనిపిస్తుంది. కానీ నిజంగానే జరిగింది. వివారాల్లోకి వెలితే...జపాన్‌ రాజవంశపు యువరాణి అయాకో(28)..కియ్‌ మోరియా(32) అనే సామాన్యుడికి మనసిచ్చింది. ఆ దేశ నిబంధనల ప్రకారం రాజవంశపు స్త్రీలు సామాన్యుడిని పెళ్లి చేసుకుంటే తమ రాజరికాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత సామాన్యురాలిగా పరిగణించడంతో పాటు ఆమెవారసులకు సిం హాసనంపై హక్కు ఉండదు. అయినా అయాకో తన ప్రేమను వదులుకోలేదు. ఓ షిప్పింగ్‌ కంపెనీ ఉద్యోగి కియ్‌ మోరియాను రాజకుటుంబం పవిత్రంగా భావించే టోక్యోలోని మెయిజీ ఆలయంలో పెళ్లి చేసుకుంది.