ప్రేక్షకుల ముందుకు నేడే బంగారి బాలరాజు

13:01 - October 25, 2018

చిన్న సినిమాల అదృష్టం ప్లస్ కంటెంట్ రాజ్యమేలుతున్న ట్రెండ్ లో ఈ రోజు మరో ప్రేమ కథ బాక్స్ ఆఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అదే బంగారి బాలరాజు. టీనేజ్ ప్రేమలో పడిన ఓ జంటకు అమ్మాయి తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి వాటిని హీరో ఎలా ఎదురుకుని తన ప్రేమను గెలిపించుకున్నాడు అనే పాయింట్ తో ఇది రూపొందింది. ట్రైలర్ లో ఇది స్పష్టంగా తెలిసేలాగే కట్ చేసారు. సహజత్వంతో కూడిన ప్రేమ కథలకు ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో దీని విజయం పట్ల నిర్మాతలు ధీమాగా ఉన్నారు.ఈ మూవీకి కోటెంద్ర దుద్యాల దర్శకుడు. ఈయన గతంలో నంది అవార్డు గ్రహీత. మొత్తం గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరూ కొత్తవారే. రాములమ్మ సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ కారుణ్య హీరో. సీనియర్ ఆర్టిస్టులను సపోర్టింగ్ రోల్స్ లో తీసుకున్న ఈ బంగారి బాలరాజు ప్రేమతో పాటు బాక్స్ ఆఫీస్ యుద్ధంలో గెలుస్తారో లేదో ఈ  రోజు తేలిపోతుంది. వీరభోగవసంతరాయలుతో పాటు మరో డబ్బింగ్ సినిమా మాత్రమే పోటీ ఉన్న నేపథ్యంలో బంగారి బాలరాజు యూత్ కి మంచి ఛాయస్ గా నిలుస్తుందని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు. నంది క్రియేషన్స్ బ్యానర్ పై లవర్  ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ తో ఇది రూపొందింది.